© 2026 nimisham.in

ఆదిలాబాద్ సాంస్కృతికం: వయోవృద్ధుల సమాఖ్య నాయకులు బుధవారం ఎంపీ నగేశ్‌ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సీనియర్ సిటిజన్స్ మల్టీపర్పస్ డే కే సెంటర్ గురించి వివరించారు.
ఖాళీగా ఉన్న అక్కడి ప్రదేశంలో షెడ్ నిర్మాణానికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు. షెడ్డు అందుబాటులోకి వస్తే వృద్ధులకు టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ ఆడుకోవడానికి, జిమ్ ఏర్పాటు చేస్తే చిన్నపాటి వ్యాయామం చేయడానికి, సమావేశం నిర్వహించడానికి వీలు అవుతుందన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈ విషయంపై చర్చించి, తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సమాఖ్య బాధ్యులు డా.దేవిదాస్ దేశ్‌పాండే, రామ్ కులకర్ణి, గంగాధర్, శశికాంత్, నరసింహులు తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.