Nimisham.

Every Minute, Every Story. Real-time unbiased Telugu digital media & cinema portal.

తెTeluguEnEnglishहिHindiಕKannada

News Categories

  • Latest Breaking News
  • Cinema & Tollywood
  • Politics & Elections
  • National News
  • World Affairs
  • Sports & Cricket
  • Technology & AI

Cinema & Finance

  • Box Office Collections
  • Hit or Flop Reports
  • Movie Directory
  • Stock Market & IPO
  • Business & Economy
  • Gold & Silver Rates

Government Services

  • AP Welfare Schemes
  • Telangana Schemes
  • Citizen Services Hub
  • MeeSeva & Land Records
  • Dharani Land Records

Company & Legal

  • About Us
  • Contact Us
  • Publisher Sitemap Hub
  • Google News Sitemap
  • Privacy Policy
  • Terms & Conditions
Contact & Advertising Inquiries: hello@xpeto.in•+91 72599 96233
📣 Advertise on Nimisham

© 2026 Nimisham.in · All Rights Reserved · Fast & Unbiased Digital Media.

నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.

భాష (Language)

తెTeluguEnEnglishहिHindiಕKannada
Publisher PortalAdmin Console

Categories

⚡Latest
🎬Movies
🎟️Box Office
⭐Hit or Flop
🏛️Politics
📈Market & Gold
💼Business
🏏Sports
🇮🇳National
🌍World
💻Technology
🏛️Govt Schemes
📰Publishers

© 2026 nimisham.in

నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
Market & Gold
Publish News
⚡Latest🎬Movies🎟️Box Office⭐Hit or Flop🏛️Politics📈Market & Gold💼Business🏏Sports🇮🇳National🌍World💻Technology🏛️Govt Schemes📰Publishers
Publisher LoginAdmin
HomeMoviesPoliticsMarkets

ముంబైలో బాలయ్య.. గ్యాంగ్స్టర్డ్రామాలోట్విస్ట్ ఇదే

Chitrajyothy30 May 2026, 1:52 pm
ముంబైలో బాలయ్య.. గ్యాంగ్స్టర్డ్రామాలోట్విస్ట్ ఇదే

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ (NBK111) తెరకెక్కుతున్న సంగతి విదితమే.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ (NBK111) తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో, సహజంగానే ఈ కొత్త సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులలోనూ ఆకాశాన్ని తాకేలా అంచనాలు ఏర్పడ్డాయి. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను ఒక భారీ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించాలని భావించినప్పటికీ, కథా చర్చల అనంతరం దీనిని ఒక సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మార్చారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ ముంబై నగరంలో శరవేగంగా జరుగుతోంది.


ఈ సినిమా కథాంశం గురించి చిత్ర పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన సమాచారం గట్టిగా వినిపిస్తోంది. ఇది కేవలం ముంబై అండర్‌వరల్డ్ చుట్టూ తిరిగే సాధారణ గ్యాంగ్ స్టర్ డ్రామా మాత్రమే కాదని, దీని వెనుక ఒక బలమైన దేశభక్తి ఎలిమెంట్ దాగి ఉందని టాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి చిత్రం ‘జాట్’లోనూ దేశభక్తి అంశాన్ని అద్భుతంగా పండించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీతో ఆ దేశభక్తి కాన్సెప్ట్‌ను మరింత నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. దేశ రక్షణ కోసం లేదా సమాజ హితం కోసం ఒక గ్యాంగ్ స్టర్ ఎలాంటి పోరాటం చేశాడనే కోణంలో కథ సాగుతుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగ్ డెలివరీ, ఆయన పలికించే దేశభక్తి పూరిత ఆవేశం థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో దేశభక్తి ఎలిమెంట్‌ను కథకు ప్రధాన బలంగా మలుస్తూనే, మరోవైపు మాస్ ప్రేక్షకులను అలరించే కమర్షియల్ హంగులను కూడా దర్శకుడు సమానంగా జోడిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్ స్టర్ వార్‌కు, దేశం పట్ల ఉండే బాధ్యతకు ముడిపెడుతూ స్క్రీన్‌ప్లేను చాలా పకడ్బందీగా డిజైన్ చేసినట్లు వినికిడి. బాలకృష్ణ గతంలో నటించిన పలు చిత్రాల్లోని దేశభక్తి సీన్లు ఎంతగా జనాల్లోకి వెళ్లాయో తెలియంది కాదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు ఈ పేట్రియాటిజం తోడవడంతో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే మరో విశేషం ఏమిటంటే.. యంగ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఇందులో విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. బాలయ్యకు పోటీగా ఒక పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారనే వార్త సినిమాపై హైప్‌ను ఒక్కసారిగా పెంచేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఊ..కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వెండితెరపై రిపీట్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో గ్లామరస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోందని జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ, దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి దేశభక్తి, గ్యాంగ్ స్టర్ యాక్షన్ సమ్మిళితంగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

Chitrajyothyలో పూర్తి కథనం చదవండి

Share this article

WhatsAppXEmail

తాజా వార్తలు

మండిపోతున్న ఉల్లి ధరలు..రెట్టింపైన రేట్లతో సామాన్యుడి కన్నీళ్లు
Zee Telugu•02 Sept
పోలవరంప్రాజెక్టు నీళ్లు తెచ్చేశాం అని డప్పుకోవడం ఏమిటి? వైఎస్ జగన్
Zee Telugu•02 Sept
తస్సాదియ్యా.. ఈ చికెన్ ఖలేజా మసాలా ముందు ఏ కర్రీ అయినా తక్కువే
TV9 Telugu•02 Sept
ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సూపర్ హిట్క్రైమ్థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
TV9 Telugu•02 Sept
అందం కోసం రష్మిక మందన్నా ఏం చేస్తుందో తెలుసా
TV9 Telugu•02 Sept
గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీస్టోరీ
Samayam Telugu•02 Sept

English Keywords

#nbk-111#balakrishna#gopichand-malineni#mumbai#tollywood#telugu-news#india-news#balakrishna-new-movie#nbk111#balakrishna-gangster-movie
ముంబైలో బాలయ్య.. గ్యాంగ్స్టర్డ్రామాలోట్విస్ట్ ఇదే | Nimisham