© 2026 nimisham.in

తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 5 వరకు ఛాన్స్ రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్ ఇక క్యూలో నిలబడాల్సిన పనిలేదు..
మొబైల్తోనే రేషన్ ఇ-కేవైసీ Ration Card Update : తెలంగాణ రేషన్ కార్డుదారులు ఎగిరిగంతేసే వార్త.. రేషన్ కార్డుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ భారీ ఊరటనిచ్చింది. గడువు తేదీలోగా ఒకేసారి 3 నెలలకు రేషన్ బియ్యం పొందలేని వారికి మరో ఛాన్స్.. ఆగస్టు 31తో ముగిసిన ఈ గడువును సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ బియ్యం పంపిణీకి ఆగస్టు 31 చివరి తేదీ కాగా, వర్షాలు, పండుగల రద్దీ, లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతో ఈ గడువును మరింత పెంచింది. ఈసారి విడతలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన బియ్యం ఒకేసారి తీసుకోవచ్చు. గత ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీ ప్రారంభం కాగా రద్దీ, ఇతర కారణాలతో రేషన్ తీసుకోలేకపోయారు. అర్హులైన కుటుంబాలకు ఈ పొడిగింపు చాలా రిలీఫ్. ఎలాగో పెంచారు కదా అని ఆలస్యం చేయొద్దు.. రేషన్ కార్డుదారులు లాస్ట్ డేట్ వరకు వేచి ఉండొద్దు. మీకు దగ్గరలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం బెటర్. Read Also : Air Marshal Jeetendra Mishra : అయోధ్య రామ మందిర ఫస్ట్ CEO ఇతడే.. జితేంద్ర మిశ్రా ఎవరు? ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే! మొబైల్తో e-KYC ఎలా? : రేషన్ కార్డు e-KYC ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్ అవుతుంది. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా ఈ ప్రాసెస్ నడుస్తోంది. కానీ, ఇప్పటిరవకూ రేషన్ షాపులో e-POS మిషన్ ద్వారా ఫింగర్ ఫ్రింట్ కేవైసీ చేసుకునే వీలుంది. ఇకపై రద్దీ కారణంగా అక్కడ కేవైసీ పూర్తి చేయలేని వారికి మొబైల్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ ఇలా : మీ ఫోన్లో 'Mera eKYC' యాప్ను ఓపెన్ చేయండి. రాష్ట్రం (Telangana) పేరును ఎంచుకోండి. రాష్ట్రం ఎంటర్ చేయండి. ఆపై Next ఆప్షన్ ఎంచుకోండి. కుటుంబ సభ్యుని ఆధార్ నంబర్ను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక లింక్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది 6 అంకెల ఓటీపీని యాప్లో ఎంటర్ చేయండి. అక్కడి క్యాప్చా (Captcha) కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఆపై సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఫస్ట్ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టే. సెకండ్ ఫేస్ వెరిఫికేషన్ ప్రాసెస్ : ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో Mera eKYC, Aadhaar Face RD యాప్స్ తప్పనిసరి. మేరా ఇకేవైసీలో (Telangana)ను ఎంచుకోవాలి. కుటుంబ సభ్యుడి ఆధార్ వివరాలు కూడా ఎంటర్ చేసి OTP, క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆధార్ ఫేస్ RD ద్వారా ఫేస్ అథెంటికేషన్ జరుగుతుంది. సరైన వెలుతురులో మీ ఫేస్ కెమెరా ముందు ఉంచి సూచనలను పాటిస్తే చాలు.. మీ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్ టైంలో ఫేస్ వద్ద సర్కిల్ గ్రీన్ కలర్ మారినప్పుడు కనురెప్పలు బ్లింక్ చేయాలి. అప్పుడు యాప్ మీ ఫేస్ స్కాన్ అవుతుంది. ఆధార్ డేటాబేస్ ఫొటోతో మ్యాచ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయితే రేషనల్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే.. Note : యాప్లో వ్యక్తిగత ఆధార్ వివరాలు ఎంటర్ చేసే ముందు మీరు వాడేది అధికారిక యాప్ అవునో కాదో చెక్ చేసుకోండి. యాప్ వివరాలు, డెవలపర్ను తప్పనిసరిగా చెక్ చేయండి.